మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: శనివారం, 21 అక్టోబరు 2017 (16:37 IST)

మాస్ దర్శకుడికి 'మహానుభావుడు' హీరో వేడుకోలు.. ఎందుకు?

దర్సకుడు అనిల్. రాజా ది గ్రేట్ సినిమాతో తానేంటో మరోసారి నిరూపించుకున్న దర్శకుడు. గతంలో కొన్ని సినిమాలు చేసినా అవన్నీ హిట్టే. హిట్ దర్సకుల జాబితాలో రవితేజతో తీసిన సినిమా సూపర్ హిట్. ఇలా అనిల్‌కు తెలుగు సినీపరిశ్రమలో మంచి గుర్తింపే వచ్చింది. రాజా ది గ్

దర్సకుడు అనిల్. రాజా ది గ్రేట్ సినిమాతో తానేంటో మరోసారి నిరూపించుకున్న దర్శకుడు. గతంలో కొన్ని సినిమాలు చేసినా అవన్నీ హిట్టే. హిట్ దర్సకుల జాబితాలో రవితేజతో తీసిన సినిమా సూపర్ హిట్. ఇలా అనిల్‌కు తెలుగు సినీపరిశ్రమలో మంచి గుర్తింపే వచ్చింది. రాజా ది గ్రేట్ లో దర్శకత్వంలో అనిల్ చూపిన మెళుకువలు చాలా మంది దర్శకులను బాగానే నచ్చింది. అందుకే ఆ డైరెక్టర్‌తో ఒక సినిమా చేయాలన్నది కొంతమంది యువ హీరోల ఆలోచన.
 
ఆ యువ హీరోల్లో శర్వాన్ కూడా ఉన్నాడు. స్వయంగా అనిల్‌కు కాల్ చేసి నాతో ఒక సినిమా ప్లాన్ చెయ్యండి ప్లీజ్ అంటూ వేడుకున్నాడట శర్వాన్. అంతేకాదు త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళాలి. నాకు మళ్ళీ మంచి హిట్ కావాలంటూ ప్రాధేయపడ్డాడట. అయితే కథను సిద్థం చేసుకోవాలి.. కాస్త సమయమివ్వు అంటూ శర్వాన్‌ను కోరాడట అనిల్. 
 
వీరిద్దరు ఫోన్లో మాత్రమే సంభాషణలు చేసుకున్నట్లు తెలుగు సినీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అటు మాస్‌కు ఇటు క్లాస్‌కు అలాగే లవర్ బాయ్‌గా నటించగల సత్తా శర్వాన్‌లో ఉంది. మరి అనిల్ ఎలాంటి కథను సిద్థం చేసి శర్వాన్‌కు హిట్ ఇస్తారో వేచి చూడాల్సిందే.