విశ్వనటుడు పార్టీలో చేరనున్న సెక్సీ క్వీన్
విశ్వనటుడు కమల్ హాసన్ స్థాపించిన రాజకీయ పార్టీ మక్కల్ నీది మయ్యం. ఈ పార్టీలో యువతతో పాటు కమల్ హాసన్ అభిమానులు, పలువురు సినీ సెలెబ్రిటీలు చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వారిలో సౌత్ సెక్సీ క్వీన్ షకీలా చేరిపోయారు. ఈమె త్వరలోనే కమల్ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు.
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, తన అభిమాన హీరో కమల్ హాసన్ అని, ఆయన స్థాపించిన పార్టీలో త్వరలోనే చేరుతానని చెప్పారు. అయితే, ఆమె పొలిటికల్ ఎంట్రీపై పలు రకాల కథనాలు వినొస్తున్నాయి. ఆమెను తన పార్టీలో చేర్చుకునేందుకు కమల్ హాసన్ సమ్మతిస్తారా? లేదా? అన్నది తేలాల్సివుంది.