మొన్నేమో జగన్.. నిన్నేమో పవన్, బాబులతో అలీ భేటీ.. ఎందుకు?
ప్రముఖ హాస్య నటుడు అలీ ప్రస్తుతం రాజకీయాల్లో పెను చర్చకు దారితీశారు. మొన్నటికి మొన్న వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలిశారు. దీంతో అందరూ అలీ జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు భావించారు. కానీ తాజాగా అలీ అటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కూడా కలిశారు. దీంతో అలీ భేటీల వెనుక అసలు కారణం ఏమిటనేదానిపై చర్చ సాగుతోంది.
ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును అలీ ఆదివారం కలిశారు. చంద్రబాబు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లే సమయంలో ఉండవల్లిలోని ఆయన నివాసం కలిసి.. అరగంట పాటు భేటీ అయ్యారు.
అంతకుముందు ఆదివారం ఉదయం జనసేన చీఫ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను కలిశారు. దీంతో అలీ వరుస భేటీలు చర్చనీయాంశంగా మారాయి. అసలు అలీ ఏం ప్లాన్ చేస్తున్నాడో అర్థం కావట్లేదని రాజకీయ నేతలు తలపట్టుకుంటున్నారు. మొత్తానికి అలీ ఏ పార్టీలో చేరుతారనేది ఉత్కంఠగా మారింది.