శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2022 (22:33 IST)

కేజీఎఫ్ బ్యూటీకి శ్రీనిధికి ఛాన్సులు రావట్లేదా? ఏంటి సంగతి? (video)

Srinidhi Shetty
'కేజీఎఫ్' బ్యూటీ శ్రీనిధి శెట్టి ప్రస్తుతం పారితోషికాన్ని భారీగా పెంచేసిందని వార్తలు వస్తున్నాయి. కేజీఎఫ్ క్రేజ్‌తో పారితోషికం విషయంలో తగ్గేది లేదంటూ శ్రీనిధి తేల్చి చెప్పేసింది.
 
'కేజీఎఫ్ 2' కూడా సంచలన విజయాన్ని సాధించడంతో అంతకన్నా ముందున్న పారితోషికాన్ని మరింత పెంచిందట. ఇంతవరకూ ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువ. 
 
'కేజీఎఫ్' హిట్‌లో ఆమె పాత్ర కూడా చాలా తక్కువే. అయినా ఆమె తన పారితోషికాన్ని ఒక రేంజ్‍‌లో పెంచడంతో నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారట. 
 
కొత్త ప్రాజెక్టులలో ఆమె కనిపించకపోవడానికి కారణం ఇదేననే టాక్ శాండల్ వుడ్‌లో వినిపిస్తోంది. శ్రీనిధి శెట్టి మంచి పొడగరి.. ఆకర్షణీయమైన రూపం ఆమె సొంతం. 
 
ప్రభాస్ .. మహేశ్ వంటి హీరోల సరసన ఆమెను చూడాలని అభిమానులు ఆశపడుతుంటే,  ఆమె మాత్రం పారితోషికం విషయంలో దిగిరావడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఒక వేళ ఆమె పారితోషికంలో వెనక్కి తగ్గితే.. దక్షిణాది భాషల్లో ఓ వెలుగు వెలిగుతుందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.