సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 జూన్ 2022 (07:16 IST)

సమతాస్ఫూర్తి కేంద్రం ప్రవేశ రుసం ఒక్కసారిగా రూ.50 పెంపు

samatha murthy
హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన ముచ్చింతల్‌లో శ్రీరామానుజాచార్యుల సమతామూర్తి కేంద్రాన్ని ఇటీవల ఏర్పాటుచేశారు. ఈ కేంద్రాన్ని సందర్శించాలని భావించే పర్యాటకుల నుంచి నామమాత్రపు ప్రవేశ రుసుంను వసూలు చేస్తూ వచ్చారు. అయితే, ఇపుడు ఈ రుసుంను భారీగా పెంచేశారు. 
 
ప్రస్తుతం ఇక్కడ పెద్దలకు రూ.150, చిన్నారులకు రూ.75గా వసూలు చేసేవారు. ఇపుడు దీన్ని రూ.200, రూ.125 చేశారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సమతామూర్తి కేంద్రాన్ని తిలకించేందుకు సందర్శకులకు అనుమతి ఇస్తారు. బుధవారం సెలువు ప్రకటించడంతో ఆ రోజు మాత్రం అనుమతి లేదు. 
 
మరోవైపు, ఈ కేంద్రంలో ప్రధాన ఆకర్షణ అయిన డెనమిక్ వాటర్ ఫౌంటెయిన్ షోను ఇక నుంచి నాలుగుసార్లు ప్రదర్శించనున్నారు. లీలానీరాజనం పేరుతో నిర్వహించే ఈ వాటర్ ఫౌంట్ షోను మధ్యాహ్నం 1, సాయంత్రం 4, 6, రాత్రి 8 గంటలకు ప్రదర్శించనున్నారు.