తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన కోడికూర ధర  
                                       
                  
                  				  తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కోడికూర కొండెక్కింది. ఏకంగా కేజీ చికెన్ ధర ట్రిబుల్ సెంచరీ కొట్టింది. అంటే రూ.300 దాటిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వీటి ధరలు పెరిగిపోవడంతో మాంసాహార ప్రియులు లోబదిబోమంటున్నారు. 
				  											
																													
									  
	 
	ఏపీలోని విజయవాడ నగరంలో కేజీ చికెన్ ధర రూ.306గా పలుకుంది. హైదరాబాద్ నగరంలో కూడా గతంలో ఎన్నడూ లేనివిధంగా ధరలు పెరిగిపోయాయి. గత నెల 7వ తేదీన కేజీ చికెన్ ధర రూ.185గా ఉంటే ఇపుడది రూ.300కు చేరువలో వచ్చింది. చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో మాంసాహారప్రియులే కాదు వ్యాపారాలు కూడా వ్యాపారం లేక తీవ్ర నిరుత్సాహం చెందుతున్నారు.