1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 జనవరి 2022 (14:13 IST)

తెలంగాణలో చలిగాలులు: హైదరాబాదులో ఎల్లో అలెర్ట్

తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు అనేక ప్రాంతాల్లో కనిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. రాత్రిళ్లు చలిగాలులు వీస్తున్నాయి. దీంతో జనం చిగురుటాకులా వణికిపోతున్నారు. 
 
తెల్లవారుజామున చాలా ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. రహదారులను పొగ మంచు కప్పేయడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్‌లో చలి పులి పంజా విసురుతోంది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పొగ మంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 8 గంటలు అయినా సూర్యుడి జాడ కనిపించడం లేదు. చలికి ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. 
 
వాతావరణ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలోనే గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లా భీంపూర్) మండలం అర్లి (టీ) గ్రామంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
 
చలి తీవ్రత పెరుగుతుండడంతో వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలి నుంచే రక్షణనిచ్చే దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు.