శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 జనవరి 2022 (08:28 IST)

బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌కు ఒమిక్రాన్ టెన్షన్

బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ పోటీలకు ఒమిక్రాన్ వైరస్ భయం పట్టుకుంది.  వచ్చే నెల 4వ తేదీ నుంచి ప్రారంభమై 20వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ క్రీడా పోటీల కోసం చైనా అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే, కరోనా వైరస్ కేసులతో పాటు ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఫలితంగా ఈ క్రీడల నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. 
 
అదేసమయంలో ఈ క్రీడా పోటీలు జరిగే బీజింగ్‌లో జీరో కరోనా జోన్‌గా తీసుకొచ్చేందుకు అక్కడి ప్రభుత్వ అధికారులు చేయని ప్రయత్నమంటూ లేదు. అయినప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు బీజింగ్ నగరం చుట్టూత ఉన్న నగరాల్లో కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ పోటీలను నిర్వహించితీరాలన్న పట్టుదలతో ఉన్న చైనా అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాయి. 
 
బీజింగ్ సిటీకి సమీపంలో ఉన్న షియాన్ నగరంలో ఇప్పటికే లాక్డౌన్ అమలు చేస్తున్నారు. అయినప్పటికీ టియాంజిన్ నగరంలో ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. పైగా, ఈ వైరస్ శరవేగంగా వ్యాపించే అవకాశాలు ఉండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా, ఈ వైరస్ కట్టిడి కోసం టియాంజిన్ నగరంలోని 1.5 కోట్ల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు యుద్ధప్రాతిపదికన చేయాలని అధికారుల నిర్ణయించారు.