సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 21 జనవరి 2022 (22:50 IST)

శీతాకాలంలో మొండి చుండ్రు, వదిలించుకునే మార్గాలు

చుండ్రు. శీతాకాలంలో చుండ్రు సమస్య తీవ్రంగా బాధిస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చిట్కాలు ఏమిటో చూద్దాం. వేపలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు విస్తృతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు స్కాల్ప్‌లోని ఫంగస్‌ను త్వరగా తొలగించడంలో సహాయపడతాయి.

 
చుండ్రు వల్ల వచ్చే మంట, దురద నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. దీనికి ఏం చేయాలి.. కొన్ని వేప ఆకులను నీటిలో వేసి మరిగించి మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి. మంచి ఫలితం కోసం అరగంట తర్వాత స్నానం చేయాలి.

 
కలబందలో యాంటీ ఫంగల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలతో పాటు ఎక్స్‌ఫోలియేటింగ్ గుణాలు ఉన్నాయి. ఇది తలపై దురద, చుండ్రును తొలగించడంలో సహాయపడుతుంది. ఇది మాయిశ్చరైజర్‌గా కూడా పని చేస్తుంది. జుట్టును తేమ చేస్తుంది. అలోవెరా జెల్‌ను తలకు పట్టించి అరగంట పాటు అలాగే ఉంచాలి. తర్వాత నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది.