శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (10:45 IST)

బాయ్‌ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పిన ఇద్దరు పిల్లల తల్లి!

ప్ర‌పంచ మాజీ సుంద‌రి సుస్మితాసేన్. ఈమె వయసులో తనకుంటే చిన్న కుర్రోడితో సహజీవనం చేస్తూ వస్తోంది. ఇది గత 2018 నుంచి కొనసాగుతోంది. పైగా, ఇద్దరు అమ్మాయిలను దత్తత కూడా తీసుకుంది. ఆ బాయ్‌ఫ్రెండ్ పేరు రోహ్‌మ‌న్ షాల్‌. ఈ కుర్రోడితో డేటింగ్‌లో ఉన్న సుస్మితా సేన్ ఇపుడు బ్రేకప్ చెప్పినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. 
 
అయితే త‌న వ్య‌క్తిగ‌త జీవితం గురించి ఓ పోస్ట్ పెట్టి త‌న ఫాలోవ‌ర్ల‌కు ఒకింత షాక్‌కు గురిచేసింది సుస్మిత‌. 'స‌మ‌స్య ఏంటంటే అత‌డు మారుతాడ‌ని మహిళ భావిస్తుంది. కానీ అత‌డు మార‌డు. పురుషులు చేసే త‌ప్పును ఆమె ఎప్ప‌టికీ క్ష‌మించ‌దు. ఆమె వ‌దిలి వెళ్లిపోతుంది. ఈ క‌థ‌లో నీతి ఏంటంటే అత‌డు మార‌డు. ఆమె వెళ్లిపోతుంది..' అంటూ పోస్ట్ పెట్టింది సుస్మితాసేన్‌.
 
ఈ పోస్ట్ నెట్టింట్లో వైర‌ల్ అవుతుంది. సుస్మితాసేన్ పెట్టిన సందేశంతో బాయ్‌ఫ్రెండ్ రోహ్‌మ‌న్‌కు సుస్మితాసేన్ దాదాపు బ్రేక‌ప్ చెప్పింద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే ఇదే విష‌యంపై నెటిజ‌న్లు క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక్కో నెటిజ‌న్లు ఒక్కో విధంగా కామెంట్లు పెడుతున్నారు. సుదీర్ఘ విరామం త‌ర్వాత ఇటీవ‌లే ఆర్య వెబ్‌సిరీస్‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.