సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : శుక్రవారం, 4 జనవరి 2019 (18:29 IST)

బాయ్‌ఫ్రెండ్‌తో సుస్మితా సేన్ రొమాంటిక్ వర్కౌట్ వీడియో..

మాజీ మిస్ యూనివర్శ్‌, సుస్మితా సేన్.. నాలుగు పదుల వయస్సులో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకోకుండా.. కొన్నేళ్లు నెట్టేసిన సుస్మితా సేన్.. పిల్లలపై మమకారంతో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని పెంచేసింది. ఇన్నాళ్లు పెళ్లి మీద శ్రద్ధ పెట్టని సుస్మితా సేన్.. ప్రస్తుతం వయస్సులో తనకంటే 15 ఏళ్ల చిన్నవాడిని ప్రేమిస్తోంది. రొహమన్ షాల్ అనే ఈ యువ మోడల్.. త్వరలోనే సుస్మితను పెళ్లి చేసుకోబోతున్నాడని టాక్.
 
తాజాగా ఈ జంట రొమాంటిక్ వర్కౌట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తన బాయ్‌ఫ్రెండ్ రొహమన్ షాల్‌తో చేసిన రొమాంటిక్ వర్కౌట్ వీడియోను సుస్మితా సేన్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. తన బాయ్‌ఫ్రెండ్ బర్త్ డే సందర్భంగా ఈ వీడియోను సుస్మిత సోషల్ మీడియాలో పోస్టు చేసింది. కాగా కొన్ని నెలల క్రితం ఓ ఫ్యాషన్ షోలో రొహమన్ షాల్‌ను చూసిన సుస్మిత అక్కడే ప్రేమలో పడిందని సమాచారం. 
 
ఇకపోతే.. రొహమాన్ సంగీత కళాకారుడు. మంచి గాయకుడు కూడాను. సుస్మిత పిల్లలకు ఇతనే సంగీతం నేర్పించాడు. ఈ క్రమంలోనే రొహమాన్ సుస్మితకు బాగా నచ్చాడని తెలుస్తోంది. ఇంకేముంది... సుస్మిత రొహమాన్ రొమాంటిక్ వర్కౌట్ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.