ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (11:09 IST)

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌లో వస్తున్న మెగా హీరో

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ కాంబినేషన్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న సంచలన చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ సంచలన చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పది భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాని జులై 30న రిలీజ్ చేయనున్నట్టు అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు. 
 
ఆ తర్వాత షూటింగ్ అనుకున్న ప్లాన్ ప్రకారం జరగకపోవడం వలన ఆర్ఆర్ఆర్ మూవీని 2021లో జనవరి 8న రిలీజ్ చేయనున్నట్టు అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. 
 
ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ముందుగా రిలీజ్ చేయాలనుకున్న డేట్‌కి మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అవును జులై 30న వరుణ్ తేజ్ సినిమాని రిలీజ్ చేయనున్నారు. 
 
వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి ఓ సినిమాని రూపొందిస్తున్నారు. బాక్సింగ్ నేపధ్యంతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాని అల్లు వెంకటేష్ - సిద్దు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మోగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ చిత్రానికి సమర్పకునిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా నటిస్తున్నారు. దీని కోసం గత కొంతకాలంగా వరుణ్ బాక్సింగ్‌లో ట్రైనింగ్ తీసుకున్నారు.
 
అయితే... ఈ మూవీ షూటింగ్‌ని వైజాగ్‌లో ప్రారంభించారు. ఇది వరుణ్ తేజ్ నటిస్తున్న 10వ చిత్రం. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన సందర్భంగా వరుణ్ తేజ్ ట్విట్టర్లో స్పందిస్తూ... వైజాగ్‌లో ఫస్ట్ డే షూటింగ్. మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ షూటింగ్ లోకేషన్లో ఉన్న కెమెరా స్టిల్ పోస్ట్ చేసారు. కెరీర్ బిగినింగ్ నుంచి ముకుందా, కంచె, లోఫర్, ఫిదా, తొలిప్రేమ, అంతరిక్షం, ఎఫ్ 2... ఇలా డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారు వరుణ్ తేజ్. 
 
ఇటీవల కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్లో గద్దలకొండ గణేష్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్లో అద్భుతంగా నటించి మెప్పించారు.
 
 ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టి వరుణ్ తేజ్ కెరీర్లో హిట్ సినిమాగా నిలిచింది. వరుణ్ తేజ్‌కి మంచి పేరు తీసుకువచ్చింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌తో ప్రస్తుతం చేస్తున్న సినిమా కూడా చాలా వైవిధ్యంగా ఉంటుందని.. వరుణ్ తేజ్‌కి ఈ సినిమా కూడా మంచి పేరు తీసుకువస్తుందని.. చిత్ర యూనిట్ చెబుతున్నారు. ఈ సినిమా ద్వారా అల్లు అరవింద్ పెద్ద అబ్బాయి అల్లు వెంకటేష్ నిర్మాతగా పరిచయం అవుతుండడం విశేషం.