బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 మార్చి 2020 (11:02 IST)

ఆర్ఆర్ఆర్‌లో విజయ్ నటిస్తున్నాడా?

జక్కన్న రాజమౌళి తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ సినిమాలో కోలీవుడ్ అగ్ర హీరో విజయ్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి పోస్టర్లు విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా చరణ్ తాలూకా ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేసి సినిమాపై అంచనాలు పెంచారు. 
 
ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తుండగా, బాలీవుడ్ భామ అలియా, అజయ్ దేవగన్‌తో పాటు హాలీవుడ్ ప్రముఖ నటి నటులు నటిస్తుండడంతో వరల్డ్ వైడ్‌గా ఈ మూవీఫై ఆసక్తి నెలకొని ఉంది. ఈ సంగతి పక్కన పెడితే ఈ మూవీలో తమిళ్ హీరో విజయ్ నటిస్తున్నాడనే వార్త ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. 
 
రాజమౌళి ఈ చిత్రం కోసం విజయ్‌ను తీసుకుంటున్నాడని, మే నెలలో విజయ్ ఈ చిత్రషూటింగ్‌లో పాల్గొంటారని గాసిప్స్ వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే వేచి చూడాలి.