శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 డిశెంబరు 2021 (12:06 IST)

ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి నాలుగో పాట: 'రోర్ ఆఫ్ భీమ్' అదరగొడతాడా?

ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి కొత్త అప్డేట్ వచ్చేసింది. డైరెక్టర్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్ఆర్ఆర్' నుంచి నాలుగో పాట రిలీజ్ కానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా తెరకెక్కనుంది. స్వాతంత్ర పోరాట నేపథ్య కల్పిత కథతో రూపొందిన ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ లో చిత్రబృందం జోరు పెంచేసింది. ఈ నేపథ్యంలో సినిమాలోని నాలుగో సాంగ్ 'రోర్ ఆఫ్ భీమ్'ను శుక్రవారం రిలీజ్ చేయనున్నట్లు చిత్రబందం ట్విట్టర్ లో పేర్కొంది. అయితే ఆ పాటకు సంబంధించిన ప్రొమోను గురువారం విడుదల చేయనున్నారు. 
 
ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించారు. ఇందులో హీరోయిన్లుగా అలియా భట్, ఒలివియా మోరిస్ నటించారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మించారు.  రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మించారు.