గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 డిశెంబరు 2021 (13:08 IST)

తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల విడుదల.. ఎప్పుడంటే?

తెలంగాణ ఇంటర్ విద్యర్థులు ఎప్పెడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలను బుధవారం (డిసెంబర్ 15)న విడుదల కానున్నాయి. కరోనా వైరస్ కారణంగా గత సంవత్సరం ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు అయిన విషయం తెలిసిందే. 
 
ఈ పరీక్షలను ఇటీవల నిర్వహించింది ఇంటర్ బోర్డు. ఈ పరీక్షా ఫలితాలను ఇంటర్ బోర్డు బుధవారం విడుదల చేయాలని అధికారులు సిద్ధమయ్యారు. 
 
అలాగే ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్ బోర్డు ఇంతకుముందు నిర్ణయించింది. ఈ క్రమంలో డిసెంబర్ 3 నుంచి 7 వరకు ఇంటర్ ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు.
 
కాగా మరోవైపు వచ్చే ఏడాది ఇంటర్‌ వార్షిక పరీక్షలను ఏప్రిల్‌ నెలలో నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. షెడ్యూల్‌ ప్రకారం 2022 మార్చి 23 నుంచి ఇంటర్‌ పరీక్షలు జరగాలి. 
 
అయితే ఈ ఏడాది కూడా కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతుల ప్రారంభం ఆలస్యమైంది. దీంతో ఇంటర్ పరీక్షలను ఏప్రిల్ నెలలో నిర్వహించాని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.