గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 4 అక్టోబరు 2024 (17:49 IST)

విశ్వం నుంచి గోపీచంద్, కావ్యథాపర్ ల రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది

Gopichand, Kavyathapar
Gopichand, Kavyathapar
వస్తాను.. వస్తాను. చేయి జారిపోనీయకే.. అంటూ గోపీచంద్ చేయి పట్టుకుని కావ్యథాపర్ సముద్రంలో పరవశించి పోయే సన్నివేశంలో పాట ను ఈరోజు రిలీజ్ అయింది. కపిల్ కపిలన్ గాత్రం చేసిన ఈ పాట డ్రీమ్ సాంగ్ గా చిత్రంలో మూడవ పాటగా వుండబోతోంది. ఇటీవలే మొండితల్లి పిల్ల అనే సెకండ్ రిలీజ్ అయి సెంటిమెంట్ సాంగ్ నిలిచింది. ఈరోజు విడుదలైన పాట రొమాంటిక్ సాంగ్. వెంగి సాహిత్యం అందించారు.
 
గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ మూవీ 'విశ్వం'లోనిది ఈ సాంగ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
    
 ఈ చిత్రానికి కెవి గుహన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే రాశారు. ఎడిటర్‌గా అమర్‌రెడ్డి కుడుముల, ఆర్ట్‌ డైరెక్టర్‌ కిరణ్‌ మన్నె. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.