మంగళవారం, 5 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 1 అక్టోబరు 2024 (19:40 IST)

సినిమా విడుదలయ్యాక వారం తర్వాత రివ్యూలపై రచ్చ?

karti, aravindswami
karti, aravindswami
ఇటీవలే సినిమాలు విడుదలయితే వెంటనే రివ్యూలు రాయడంపై ఆయా సినిమాలపై తీవ్రప్రభావం చూపుతాయని అందుకే వారం తర్వాత రివ్యూలు రాయమని కేరళ చలనచిత్ర పరిశ్రమ పేర్కొనడంపై పలువురు ప్రముఖులు వ్యతిరేకతను వ్యక్తం చేశారు. తెలుగులో కూడా ఇటీవలే విడుదలైన పెద్ద సినిమాపై సరిగ్గా రివ్యూలు రాయలేదని రివ్యూవర్లపై కించిత్ కినుకవహించారు దర్శక నిర్మాతలు . ఈ టాపిక్  సత్యం,సుందరం సినిమా సక్సెస్ సందర్భంగా చర్చకు వచ్చింది. కార్తీ, అరవింద్ స్వామి పాత్రలతోనే సినిమా అంతా దర్శకుడు ప్రేమ్ కుమార్ అద్భుతంగా తీయడంతో తెలుగులోనూ మంచి ఆదరణ పొందుతోంది. అయితే కమర్షియల్ గా అంత సక్సెస్ కాకపోయినా మంచి సినిమా తీశారనే ఫీలింగ్ ను ప్రతిఒక్కరూ వ్యక్తం చేశారు.
 
కాగా, ఈ సినిమా సక్సెస్ మీట్ లో కొందరు సీనియర్ రివ్యూవర్లు మాట్లాడుతూ తమిళ సినిమా కాబట్టి రెండు పాత్రలను డిజైన్ చేసే విధానం తెలుగులో అయితే వర్కవుట్ కాదేమోనని వ్యక్తం చేశాడు. దీనిని మరోలా అర్థం చేసుకున్న మరో రివ్యూవర్ మంచి తెలుగు సినిమాలు తీసే సత్తా మన దగ్గరలేదా? అంటూ ఎదురు దాడి చేశారు. ఇలా తర్జనభర్జనలు పడుతూ సక్సెస్ మీట్ ను తమ పబ్లిసిటీకి వేదికగా చేసుకోవడం అక్కడివారిని ఆశ్చర్యపరిచింది. తమిళ సినిమా సత్యం సుందరం టీమ్ ముందు తెలుగు వారు ఒకరినొకరు విమర్శించుకోవడం చాలా హాస్యాస్పదంగా చెప్పుకుంటున్నారు.