ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 1 అక్టోబరు 2024 (16:13 IST)

కన్నప్ప లో బ్రహ్మానందం, సప్తగిరి పాత్రలపై కామెడీ ఎపిసోడ్స్ చిత్రీకరణ

Brahmanandam and Saptagiri
Brahmanandam and Saptagiri
విష్ణు మంచు ‘కన్నప్ప’ నుంచి  ఇప్పుడు ఈ చిత్రంలో నటించిన బ్రహ్మానందం, సప్తగిరి కార్టెక్టర్లను రివీల్ చేశారు.  బ్రహ్మానందం ఈ చిత్రంలో పిలక పాత్రను, సప్తగిరి గిలక పాత్రను పోషించారు.  ‘చేపకు ఈత, పులికి వేట, కోకిలకి పాట.. నేర్పిన గుగ్గురువులు.. అడవికే పాఠాలు చెప్పడానికి వస్తే..’ అంటూ ఈ గురువులిద్దరి పాత్రలను అందరికీ పరిచయం చేశారు. చూస్తుంటే వీరిద్దరి కామెడీ కన్నప్ప చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్ కానున్నట్టుగా కనిపిస్తోంది. 
 
ఇప్పటి వరకు శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా, అక్షయ్ కుమార్, తిన్నడు ఉపయోగించే గుర్రం టిక్కి, మారెమ్మ పాత్రకు సంబంధించిన నటి ఐశ్వర్య లుక్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. డిసెంబర్‌లో ఈ సినిమా పాన్‌ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది.