బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 24 ఫిబ్రవరి 2022 (09:36 IST)

Bheemla Nayak భీమ్లా నాయక్ బెనిఫిట్ షోలు వేస్తే బెండు తీస్తాం: ఏపీ ప్రభుత్వం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

 
చిత్రం ప్రి-రిలీజ్ వేడుక యూసఫ్ గూడ లోని పోలీసు గ్రౌండ్సులో ఘనంగా జరిగింది. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి మరింత ప్రోత్సాహం ఇస్తామని ఐటీ శాఖామంత్రి కేటీఆర్ చెప్పారు. భారతదేశంలోని చిత్ర పరిశ్రమకి హైదరాబాద్ నగరాన్ని కేంద్రంగా తయారూచేస్తామని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని యాదవ్ అన్నారు.

 
ఇదిలావుంటే పవన్ ఫ్యాన్స్‌ను నిరుత్సాహపరిచే నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. భీమ్లా నాయక్ సినిమా బెనిఫిట్‌ షోలు కానీ అదనపు షోలు వేయరాదనీ, ఈ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. సినిమా టికెట్‌ రేట్లు ప్రభుత్వ నిబంధనల మేరకు ఉండాలని పేర్కొన్న ప్రభుత్వం, థియేటర్లు ప్రభుత్వ నిబంధనలను పాటించేలా రెవెన్యూ అధికారుల నిఘా పెట్టాలని సూచించింది.