శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 అక్టోబరు 2019 (17:02 IST)

పరుచూరిని అవమానపరిచిన 'మా' సభ్యులు : పృథ్వీ

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సమావేశం రసాభాసగా మారింది. మా అధ్యక్షుడు నరేష్‌కు తెలియకుండా మిగిలిన సభ్యులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో గందరగోళంగా మారింది. దీంతో పలువురు సభ్యులు మధ్యలో నుంచే సభ్యులు అర్థాంతరంగా వెళ్లిపోయారు.  
 
'మా' అధ్యక్షుడు నరేష్‌కు తెలియకుండానే 'మా' అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జీవితా రాజశేఖర్.. ఆదివారం ఫిలిం ఛాంబర్‌లో ఈ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌కు నరేష్ తప్ప మిగిలిన సభ్యులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేష్ వర్గం.. జీవితా రాజశేఖర్ వర్గం మధ్య మాటల యుద్ధం జరిగింది. అధ్యక్షుడు లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని నరేష్‌ తరపు సభ్యులు ప్రశ్నించడంతో గందరగోళం నెలకొంది. 
 
ఈ సమావేశానికి హాజరైన ఈసీ సభ్యుడైన ఎస్వీబీసీ ఛైర్మన్, పృథ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఈసీ మెంబర్‌ పదవి అక్కర్లేదని, 'మా'  తీరు మారకుంటే రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ఈసీ మెంబర్‌గా గెలిచినందుకు ఆనందపడాలో.. బాధపడాలో తెలియడం లేదన్నారు. 
 
'మా'లో ఎవరి గ్రూపులు వారు పెట్టుకున్నారని, మెంబర్స్‌ కూడా ఎవరికి వారే ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా, దాదాపు 400 సినిమాలకు కథలు రాసిన పరుచూరి గోపాలకృష్ణని ఘోరంగా అవమానించారని పృథ్వీ ఆరోపించారు. సభ్యుల తీరు నచ్చకనే ఆయన సమావేశం నుంచి అర్థాంతరంగా బయటకు వెళ్లిపోయారని ఆయన వివరణ ఇచ్చారు.