శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 ఆగస్టు 2021 (15:28 IST)

సైలెంట్‌గా 'ఆర్ఎక్స్ 100' హీరో కార్తికేయ నిశ్చితార్థం

ఆర్ఎక్స్ 100 చిత్రం ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన హీరో కార్తికేయ. ఈయన త్వరలోనే పెళ్లి వీటలెక్కనున్నారు. ఇందుకోసం ఆయన రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఎలాంటి హ‌డావిడి లేకుండా నిశ్చితార్ధం చేసుకున్నారు. ప్ర‌స్తుతం కార్తికేయ నిశ్చాతార్ధానికి సంబంధించిన ఫొటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.
 
ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫంక్షన్‌ హాల్‌లో కార్తికేయ నిశ్చితార్థం జ‌ర‌గ‌గా, ఈ వేడుక‌కు కేవ‌లం కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌ర‌య్యార‌ట‌. ప‌లువురు సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. 
 
అయితే కార్తికేయ చేసుకోబోయే అమ్మాయికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం కార్తికేయ హీరోగానే కాకుండా విల‌న్ పాత్ర‌లు పోషిస్తున్నారు. నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్‌లీడర్‌’లో కార్తికేయ విలన్‌గా నటించారు. అజిత్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘వలిమై’లోను నెగెటివ్ పాత్ర పోషిస్తున్న‌ట్టు తెలుస్తుంది.
 
అలాగే, కార్తికేయ “రాజా విక్రమార్క” సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం అతి త్వరలో విడుదల కానుంది. ఆ తర్వాత కార్తికేయ యూవి క్రియేషన్స్‌తో కలిసి ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ కోసం పని చేయబోతున్నాడు.