శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Modified: మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (21:19 IST)

డైరెక్టర్ పూరికి హీరో రామ్ బహుమతి, నక్క పేడతో...

ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకుపోయిన పూరి జగన్నాథ్ చాలా కాలంగా అటు కెరీర్‌లో విజయాలు లేక, ఇటు వ్యక్తిగత జీవత సమస్యలతో సతమతమవుతున్నాడు. ప్రస్తుతం ఇస్మార్ట్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇందులో హీరోహీరోయిన్లుగా రామ్ పోతినేని, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. తాజాగా పూరి ట్విట్టర్‌లో మా హీరో రామ్ నాకు ప్రపంచంలో అత్యంత ఖరీదైన కాఫీ పౌడర్‌ను బహుమతిగా ఇచ్చాడు. దీని గురించి తెలుసుకోవాలంటే గూగుల్‌లో వెతకండి. మీకు పిచ్చెక్కిపోద్ది అని ట్వీట్ చేసారు.
 
ఇక దీని గురించి తెలుసుకోవాలంటే, దీని ధర రూపాయల్లో చూస్తే అక్షరాలా అరవై వేలు. విదేశాలలో కొన్ని తెగలకు చెందిన నక్కలు కాఫీ గింజలను తింటుంటాయి. కానీ వాటి కడుపులో అవి అరగకుండా పేడ రూపంలో బయటికి విసర్జించబడతాయి. ఆ గింజలను సేకరించి వాటితో కాఫీ పౌడర్ తయారు చేస్తారట. 
 
నక్క కడుపులో ఉన్నప్పుడు వాటిలో వివిధ రసాయనాలు చేరడం వలన వాటికి ప్రత్యేకమైన రుచి వస్తుందట. అందుకే ఆ దేశాలలో దీనికి చాలా డిమాండ్ ఉందట. మన దేశంలో ఇప్పుడిప్పుడే దిగుమతి అవుతోందట ఈ కాఫీ పౌడర్. ఈ ట్వీట్‌కు నెటిజన్ల నుండి సెటైర్లు భారీగానే వస్తున్నాయంట.