శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 డిశెంబరు 2022 (15:04 IST)

మదురై ఎయిర్‌పోర్టులో హీరో సిద్ధార్థ్ తల్లిదండ్రులకు చేదు అనుభవం

siddharth
మదురై విమానాశ్రయంలో హీరో సిద్దార్థ్ తల్లిదండ్రులకు చేదు అనుభవం ఎదురైంది. విమానాశ్రయానికి భద్రతా ఉండే సీఆర్పీఎఫ్ జవాన్లు వృద్ధులైన సిద్ధార్థ్ తల్లిదండ్రుల పట్ల అమర్యాదగా, దురుసుగా ప్రవర్తించారు. అయితే, ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో జరిగింది. 
 
దీనిపై హీరో సిద్ధార్థ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. తన తల్లిదండ్రులతో కలిసి వస్తుంటే మదురై ఎయిర్‌పోర్టులో భద్రతా సిబ్బంది వేధించారని ఆరోపించారు. తన తల్లిదండ్రుల బ్యాగులను తనిఖీ చేసి అందులోని వస్తువులన్నీ తీయాలని చెప్పారని, వాళ్ల వయసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని తాను విజ్ఞప్తి చేయగా, పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
పైగా, వాళ్లు హిందీలోనే మాట్లాడుతుండటంతో తాను ఇంగ్లీషులో మాట్లాడాలని కోరానని, అయినా వాళ్లు హిందీలోనే మాట్లాడారని ఇలా 20 నిమిషాల పాటు వాళ్ల దురుసు ప్రవర్తన సాగిందన్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే భారత్‌లో ఇలానే ఉంటుందని దురుసుగానే సమాధానమిచ్చారని సిద్ధార్థ్ మండిపడ్డారు.