వెబ్ సీరీస్‌పై కన్నేసిన తమన్నా.. గరుడ వేగ డైరక్టర్‌తో..?
కరోనా లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓటీటీలదే హవా అన్నట్టుగా వుంది. దీంతో పలు ఓటీటీ కంపెనీలు కోట్లకు కోట్లు ఇన్వెస్ట్ చేస్తూ సినిమాలతో పాటు వెబ్ సీరీస్‌పై వెబ్ సీరీస్‌పై కూడా దృష్టి పెడుతున్నాయి. ఈ క్రమంలో భారీ పారితోషికాలను ఆఫర్ చేస్తూ ప్రముఖ తారలను, ఫిలిం మేకర్స్‌ను అటువైపు ఆకర్షిస్తున్నాయి. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఓ తెలుగు వెబ్ సిరీస్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆమధ్య 'గరుడ వేగ' వంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ వెబ్ సీరీస్ రూపొందనుంది. థ్రిల్లర్ జోనర్‌లో ఈ వెబ్ సీరీస్ 8 భాగాలుగా రూపొందుతుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సీరీస్ షూటింగ్ మొదలవుతుంది. తమన్నా ప్రస్తుతం తెలుగులో గోపీచంద్‌తో 'సీటీమార్', సత్యదేవ్‌తో 'గుర్తుందా శీతాకాలం' చిత్రాలతో పాటు హిందీలో 'బోల్ చుడియాన్' చిత్రంలో కూడా నటిస్తోంది.