శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 10 డిశెంబరు 2017 (14:09 IST)

భర్తతో పిల్లల గురించి ప్లానింగ్ చేస్తున్నా : నటి అనిత

"నువ్వు నేను" చిత్రంలో హీరో ఉదయ్ కిరణ్‌తో జతకట్టిన భామ అనిత. ఈమెకు సినీ కెరీర్ ఆరంభంలో మంచి ఛాన్స్‌లే దక్కాయి. ఆ తర్వాత ఆఫర్లు లేక ఈ అమ్మడు బాలీవుడ్ ఫ్లైటెక్కింది.

"నువ్వు నేను" చిత్రంలో హీరో ఉదయ్ కిరణ్‌తో జతకట్టిన భామ అనిత. ఈమెకు సినీ కెరీర్ ఆరంభంలో మంచి ఛాన్స్‌లే దక్కాయి. ఆ తర్వాత ఆఫర్లు లేక ఈ అమ్మడు బాలీవుడ్ ఫ్లైటెక్కింది. అక్కడ కూడా అనితకు సరైన అవకాశాలు రాకపోవడంతో పలు రియాలిటీ షోస్‌లో, సీరియల్స్‌లో నటిస్తూ అడపా దడపా సినిమాల్లో కూడా నటిస్తోంది.
 
ఈ క్రమంలో రోహిత్ శెట్టితో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత రోహిత్ శెట్టిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఈ జంట పిల్లలు కావాల‌ని ఆశపడుతున్నారట. అనిత స్వ‌యంగా త‌న ఇన్‌స్ట్రాగ్రామ్‌లో చిన్న పిల్లవాడి ఫొటోను షేర్ చేస్తూ.. కాప్షన్‌లో తన భర్త రోహిత్‌ శెట్టి‌తో ‘పిల్లల గురించి ప్లానింగ్ చేద్దాం’ అని ట్యాగ్ చేసింది. 
 
అనిత షేర్ చేసిన ఈ ఫొటోకు లక్షకు పైగా లైక్‌లు రాగా, 280 కామెంట్లు వచ్చాయి. ప్ర‌స్తుతం ప‌లు సీరియ‌ల్స్‌తో బిజీగా ఉన్న అనిత చివ‌రిగా తెలుగులో "మ‌న‌లో ఒక‌డు" అనే చిత్రం చేసింది. ఆర్పీ ప‌ట్నాయ‌క్ న‌టించి, సంగీతం అందించ‌డంతో పాటు స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించారు.