శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 3 నవంబరు 2017 (14:09 IST)

పిల్లలకు స్మార్ట్ ఫోన్ అలవాటు చేస్తున్నారా?కళ్లల్లోని తడి ఆరిపోతే అంతే?

స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణమైనా ఉండలేకపోతున్నారు.. చాలామంది. అయితే స్మార్ట్ ఫోన్ వల్ల మెదడు పనితీరు మందగిస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. స్మార్ట్ ఫోన్ విడుదల చేసే రేడియేషన్‌‌తో మెదడు పనితీరు మందగిస్తు

స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణమైనా ఉండలేకపోతున్నారు.. చాలామంది. అయితే స్మార్ట్ ఫోన్ వల్ల మెదడు పనితీరు మందగిస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. స్మార్ట్ ఫోన్ విడుదల చేసే రేడియేషన్‌‌తో మెదడు పనితీరు మందగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

స్మార్ట్ ఫోన్లను ఉపయోగించే పెద్దల్లోనే కాకుండా చిన్నారుల్లో స్మార్ట్ ఫోన్ లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. పిల్లలు, యువత స్మార్ట్ ఫోన్లను అత్యధికంగా వాడటం ద్వారా వారిలో కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌ సమస్య ఉత్పన్నమవుతున్నట్లు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
కంటితో తదేకంగా స్మార్ట్ ఫోన్లను చూడటం ద్వారా కళ్లల్లోని తడి ఆరిపోతుందని తద్వారా కళ్ల మంటలు, అలసట, మెడనొప్పి తప్పట్లేదు. ఇవి కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌‌కు కారకాలవుతున్నాయి. ట్యాబ్‌, కంప్యూటర్లను ఎక్కువగా వినియోగించే వారిలోనే ఈ సమస్యలు వస్తున్నాయి. దీనినే సింపుల్‌గా కళ్లు పొడిబారడం (డ్రై ఐస్‌) అని కూడా పిలుస్తారు.

కంటిపాపను ఆడించే సహజ ప్రక్రియ ద్వారా తేమ ఉత్పత్తి అవుతుంది. కానీ రెప్ప వాల్చకుండా తదేకంగా చూస్తే మాత్రం తేమ తగ్గి కళ్లు పొడిబారి పలు రకాల ఇబ్బందులకు దారితీస్తుంది. అందుకే చిన్నపిల్లలను స్మార్ట్‌ ఫోన్లు, కంప్యూటర్లకు దూరంగా ఉంచాలి. 
 
యువత అవసరానికి మించి స్మార్ట్‌ఫోన్ల వినియోగం తగ్గించాలి. ఎక్కువసార్లు కంటి రెప్పలను ఆర్పుతుండాలి. కంప్యూటర్‌పై ఎక్కువ సమయాన్ని వెచ్చించేవారు కనీసం గంటకోసారి ఐదు నిమిషాల చొప్పున విశ్రాంతి తీసుకోవాలి. మంచి నీటిని ఎక్కువగా తాగుతుండాలి. దీనివల్ల కొంతైనా నీటిశాతం పెరిగే అవకాశముంది. కంప్యూటర్‌, ఫోన్లను ఎక్కువ సమయం ఉపయోగించాల్సి వస్తే..స్క్రీన్ లైటింగ్‌ తగ్గించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.