4జీ హ్యాండ్‌సెంట్లలో ఎయిర్ టెల్ 5జీ సేవలు
దేశంలోని ప్రైవేట్ టెలికాం దిగ్గజం తన వినియోగదారులకు తీపికబురు చెప్పింది. త్వరలోనే 5జీ సేవలను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. 5జీ సేవలకు పునాదిగా భావించే 'మాసివ్ మల్టిపుల్-ఇన్‌పుట్ మల్టిపుల్ ఔట్‌ప
దేశంలోని ప్రైవేట్ టెలికాం దిగ్గజం తన వినియోగదారులకు తీపికబురు చెప్పింది. త్వరలోనే 5జీ సేవలను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. 5జీ సేవలకు పునాదిగా భావించే 'మాసివ్ మల్టిపుల్-ఇన్‌పుట్ మల్టిపుల్ ఔట్‌పుట్ (మీమో)' టెక్నాలజీని భారత్‌లో పరిచయం చేస్తున్నట్లు వెల్లడించింది.
తొలుత బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో ఈ సేవలను ప్రారంభించి, ఆ తర్వాత దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపింది. ఈ టెక్నాలజీ వల్ల మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ మరింత వేగవంతం కానుంది. ఇది అమల్లోకి వస్తే ప్రస్తుతం ఉన్న నెట్‌వర్క్ సామర్థ్యం 5-6 రెట్లు మెరుగుపడి, డేటా స్పీడ్ 2-3 రెట్లు పెరుగుతుందని ఎయిర్‌టెల్ అభిప్రాయపడింది.
అయితే, వినియోగదారులు ఉపయోగిస్తున్న 4జీ హ్యాండ్‌సెట్‌లోనే ఎలాంటి టారిఫ్‌లు, మార్పులు చేయకుండా 5జీ సేవలను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఎయిర్‌టెల్ ప్రారంభించిన 'ప్రాజెక్ట్ లీప్'లో భాగంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇటీవల టెలికాం శాఖ 2020లోగా భారత్‌లోకి పూర్తిస్థాయి 5జీ సేవలను తీసుకువస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకోసం రూ. 500 కోట్ల నిధిని కూడా ప్రభుత్వం కేటాయించింది.