శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 4 సెప్టెంబరు 2017 (14:36 IST)

రూ.5కే 4జీ డేటా.. ఎయిర్‌టెల్ తాజా ఆఫర్

దేశీయ టెలికాం రంగంలో వివిధ రకాల ధరల ఆఫర్ల యుద్ధం కొనసాగుతోంది. రిల‌యెన్స్ జియో పోటీని త‌ట్టుకోవ‌డానికి ఆక‌ర్షణీయ‌మైన ఆఫ‌ర్ల‌తో క‌స్ట‌మ‌ర్ల‌కు ఇతర ప్రైవేట్ టెలికాం సంస్థలు గాలం వేస్తున్నాయి. ఈ కోవలో టె

దేశీయ టెలికాం రంగంలో వివిధ రకాల ధరల ఆఫర్ల యుద్ధం కొనసాగుతోంది. రిల‌యెన్స్ జియో పోటీని త‌ట్టుకోవ‌డానికి ఆక‌ర్షణీయ‌మైన ఆఫ‌ర్ల‌తో క‌స్ట‌మ‌ర్ల‌కు ఇతర ప్రైవేట్ టెలికాం సంస్థలు గాలం వేస్తున్నాయి. ఈ కోవలో టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ముందువరుసలో ఉంది. తాజాగా ఈ సంస్థ రెండు రకాల ఆఫర్లను ప్రటించింది. ఇందులో ఒకటి రూ.349 ప్లాన్ కాగా, మరొకటి రూ.5 ప్లాన్. ఈ రెండు ఆఫర్లు వినియోగదారులను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. అలాగే, పలు రకాల రీచార్జ్‌ల‌పై క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను కూడా ఎయిర్‌టెల్ ప్రకటించింది. 
 
తొలుత రూ.349 ప్రీపెయిడ్ ప్యాక్‌లో 28 జీబీ డేటాతోపాటు అన్‌లిమిటెడ్ లోక‌ల్‌, ఎస్.టి.డి కాల్స్ చేసుకునే సౌలభ్యం కల్పించింది. ఇది 28 రోజుల కాలపరిమితి కలిగివుంటుంది. అయితే, అన్‌లిమిటెడ్ కాల్స్‌ పేరుతో పరిమితి విధించారు. వారానికి వెయ్యి నిమిషాలు దాటితే.. ఆ త‌ర్వాత నుంచి ప్ర‌తి కాల్‌కు ఎయిర్‌టెల్ నెట్‌వ‌ర్క్‌కైతే నిమిషానికి 10 పైస‌లు, ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు 30 పైస‌లు వ‌సూలు చేయ‌నుంది. ఇక రోజు వారీ ప‌రిమితి 250 నిమిషాలుగా నిర్ణయించింది. 
 
అలాగే, రూ.5తో మరో ఆఫర్ ప్రకటించింది. ఇది కేవలం 4జీ సిమ్‌కు మైగ్రేట్ అయ్యేవాళ్ల కోసం. ఎయిర్‌టెల్ నెట్‌వ‌ర్క్‌లోనే ఉన్న క‌స్ట‌మ‌ర్లు త‌మ సిమ్‌ను 4జీకి మార్చుకుంటే వాళ్ల‌కు కేవ‌లం రూ.5 రీచార్జ్‌తో 4 జీబీ డేటా ఇవ్వ‌నుంది. అయితే ఇది ఒక్క‌సారి మాత్ర‌మే రీచార్జ్ చేసుకోవ‌చ్చు. దీని వ్యాలిడిటీ 7 రోజులు. కేవ‌లం డేటా మాత్ర‌మే వాడుకోవచ్చు. ఫోన్ కాల్స్ ఉండవు. 
 
ఇకపోతే, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి రీచార్జ్ చేసుకునేవాళ్లకు 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. ఒక్కో ట్రాన్స‌క్ష‌న్‌కు గ‌రిష్టంగా రూ.25 క్యాష్‌బ్యాక్ ఇస్తున్నారు. ఉదాహరణకు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని అందులో నుంచి రూ.349 ప్యాక్ వేసుకుంటే 10 శాతం అంటే రూ.34.9 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తారు.