జనతా గ్యారేజ్‌పై ఇక దృష్టి సారిస్తా: నా కెరీర్లో 25 సినిమాలు.. హ్యాపీ అంటున్న ఎన్టీఆర్!
నాన్నకు ప్రేమతో సినిమా చేశాక.. ముందు డివైడ్ టాక్ వచ్చినా.. క్రమేణా నిలబడింది. దీంతో తన కెరీర్లో 25 సినిమా చేయడం.. నాన్నకు ప్రేమతో హిట్ కావడం చాలా ఆనందంగా ఉన్నానని ఎన్టీఆర్ తెలిపారు. ఇకపై తన దృష్టంతా జనతా గ్యారేజ్పైనేనని చెప్తున్నారు. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో 'జనతాగ్యారేజ్'లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం గురించి పూర్తి కథను విన్న తర్వాత దాన్ని మరిన్ని మెరుగులు దిద్దే ప్రయత్నంలో దర్శకుడు వున్నాడు.
మైత్రీ మూవీస్ నిర్మించనున్న ఈ చిత్రంలో సమంత, నిత్యమీనన్లు హీరోయిన్లుగా కన్పించనున్నారు. కాగా, ఈ చిత్రంలో చక్కటి సందేశం కూడా ఇమిడి వుందని.. గ్యారేజ్‌లో జరిగే సంఘటనలతో కథ మలుపు తిరుగుతుందని అదేమిటనేది తెరపై చూడాలని.. ఇటీవలే ఎన్టిఆర్ తెలియజేశారు. ఇందులో డైలాగ్స్, యాక్షన్ కూడా బాగా వుంటాయని తెలుస్తోంది. ఈ చిత్రంలో దేవయాని కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.