శుక్రవారం, 1 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 8 జనవరి 2023 (13:32 IST)

కేన్సర్ నుంచి కోలుకున్న టావీవుడ్ నటి

hamsa nandini
తెలుగు చిత్రసీమలో గ్లామరస్‍ బ్యూటీగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ హంసా నందిని. పవన్ కళ్యాణ్ నటించిన "అత్తారింటికి దారేది", "ఈగ", "మిర్చి" వంటి చిత్రాల్లో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆలరించింది. అయితే, ఈ ముద్దుగుమ్మ తెలుగులో నటించిన చిత్రాలు చాలా తక్కువే అయినప్పటికీ మంచి పేరుతోపాటు గుర్తింపును సొంతం చేసుకుంది.
 
ఆ తర్వాత కేన్సర్ బారినపడటంతో ఇండస్ట్రీకి దూరమైంది. గతయేడాదిన్నర కాలంగా కేన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నారు. ఇపుడు పూర్తిగా కోలుకోవడంతో మళ్లీ షూటింగుల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తన లుక్‍కు సంబంధించి ఓ ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఆమె బ్యాంకాగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.