శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 19 డిశెంబరు 2022 (22:14 IST)

కార్కినోస్ హెల్త్ కేర్ - జెరీ కేర్ హాస్పిటల్‌ల మధ్య కేన్సర్‌పై కీలక ఒప్పందం

geri care hospital
కార్కినోస్ హెల్త్‌కేర్, జెరీ కేర్ హాస్పిటల్ నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్, సమగ్ర కేన్సర్ కేర్ కోసం ఒకే గొడుగు కింద మెరుగైన సమాజ సేవను అందించడానికి శ్రీకారం చుట్టాయి. ఇందులోభాగంగా ఈ రెండు సంస్థల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న కార్కినోస్ హెల్త్‌కేర్ కేన్సర్ చికిత్సలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోగులకు అత్యుత్తమ సేవలను అందిస్తూ వస్తుంది.
 
అలాగే, చెన్నైలో ప్రధాన కార్యాలయం, జెరీ కేర్ హాస్పిటల్ సీనియర్ సిటిజన్‌లకు నాణ్యమైన వైద్య, సంరక్షణ సేవలను అందిస్తుంది. ఇందుకోసం నగర వ్యాప్తంగా వృద్ధాప్య క్లినిక్‌లకు నెలకొల్పి వృద్ధుల జీవనశైలికి అనుగుణంగా సేవ చేస్తుంది. ముఖ్యంగా వృద్ధుల రోగులకు వివిధ రకాలుగా సేవలు చేస్తుంది. సీనియర్ సిటిజన్‌లకు వారి ఇళ్ల వద్ద నాణ్యమైన వైద్యలను అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందింది. 
 
ఇదే అంశంపై జెరీ కేర్ వ్యవస్థాపకుడు, సీఈవో డాక్టర్ లక్ష్మీపతి రమేష్ మాట్లాడుతూ, 'మా క్లినిక్‌లో అన్ని రకాల కేన్సర్ చికిత్సలను గుర్తించడానికి కార్కినోస్ హెల్త్‌కేర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. కేన్సర్ చికిత్సలో కార్కినోస్ హెల్త్‌కేర్‌కు అపారమైన సామర్థ్యం, ​​​​నైపుణ్యం ఉన్నాయన్నారు. కార్కినోస్ హెల్త్‌కేర్ వివిధ సామర్థ్యాలను పొందిందని, ముఖ్యంగా తదుపరి తరం కేన్సర్ సంరక్షణ పరిష్కారాలు,  మాలిక్యులర్ లేబొరేటరీలను కలిగివుందన్నారు. 
 
అలాగే, జెరీ కేర్ హాస్పిటల్‌లోని జెరియాట్రిక్ ఆంకాలజీ విభాగం డాక్టర్ రాజీవ్ రాజేంద్రనాథ్ మాట్లాడుతూ, 'వృద్దాప్యంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సీనియర్ సిటిజన్‌లకు ముందస్తు కేన్సర్ స్క్రీనింగ్ యొక్క ప్రాముఖ్యతను మేం అర్థం చేసుకుని, కార్కినోస్ హెల్త్‌కేర్‌తో కలిసి పనిచేయడం వల్ల సరసమైన ధరలో ప్రపంచ స్థాయి కేన్సర్ వైద్య సేవలను అందించే వెసులుబాటు లభిస్తుందన్నారు. అలాగే, నిరుపేద సీనియర్ సిటిజన్లకు కూడా ఈ తరహా వైద్య సేవలను విస్తరించాలని యోచిస్తున్నట్టు తెలిపారు. ఇటువంటి చర్యల ద్వారా కేన్సర్‌ను ముందస్తుగా గుర్తించి చికిత్స చేస్తే తమిళనాడులో నివారణ రేటు మెరుగుపడుతుంది. ఆరోగ్య రంగంలో తమిళనాడు ఉత్తమ ఆరోగ్య రాష్ట్ర సూచికను సాధించడంలో ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. 
 
కార్కినోస్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు, సీఈవో ఆర్.వెంకటరమణన్ మాట్లాడుతూ, 'దేశంలో మొట్టమొదటి సీనియర్ సిటిజన్-ఫోకస్డ్ వృద్ధాప్య ఆసుపత్రి అయిన జెరీ కేర్‌తో భాగస్వామి కావడం ఆనందంగా ఉంది. జేరీ కేర్ కీలక భాగస్వామి. వృద్ధాప్య సంరక్షణ అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు మరియు ఆంకాలజిస్టులతో చికిత్స అందిస్తూ, రోగి సంరక్షణలో ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తుందన్నారు. ఇలాంటి సంస్థతో కలిసి పనిచేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) కోసం కమ్యూనిటీ హెల్త్ క్యాంపులకు నిర్వహిస్తామన్నారు. కేన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం, తగిన అవగాహన కల్పించడం కార్కినోస్ హెల్త్‌కేర్ యొక్క ప్రధాన లక్ష్యమన్నారు. 
 
ఈ కొత్త అవగాహన ఒప్పందం చెన్నైలో యూనివర్సల్ కేన్సర్ స్క్రీనింగ్‌కు పునాది వేస్తుంది. అదనంగా, రోగులకు ఆన్‌లైన్ ట్రీట్‌మెంట్ కన్సల్టేషన్ సపోర్ట్, వర్చువల్ ట్యూమర్ బోర్డ్ (వీటీబీ) కన్సల్టేషన్ సేవలు మరియు జీనోమ్ సీక్వెన్సింగ్ మరియు ప్రోగ్నోస్టిక్ స్టడీస్ కోసం జాతీయ, అంతర్జాతీయ కేన్సర్ నిపుణులతో సంప్రదింపులు జరిపే వెసులుబాటు లభిస్తుందన్నారు. 
 
కార్కినోస్ ఇప్పటికే కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మణిపూర్ మరియు ఢిల్లీలో సేవలందిస్తోంది. ఇపుడు తమిళనాడులోకి అడుగుపెట్టింది. భారతదేశం అంతటా వైద్య కార్యకలాపాలను విస్తరించాలని యోచిస్తోంది. ఇది నేషనల్ కేన్సర్ గ్రిడ్‌లో సభ్యత్వం కలిగివుంది. 260 కంటే ఎక్కువ కేన్సర్ చికిత్స కంపెనీలు ఎన్సీజీలు కలిగి ఉన్నాయి.