ఆదివారం, 3 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 15 డిశెంబరు 2022 (18:11 IST)

ఆది పినిశెట్టి, అరివళగన్ కాంబినేషన్ లో శబ్దం ప్రారంభమైంది

Adi Pinishetti  sabdham opening
Adi Pinishetti sabdham opening
హీరో ఆది పినిశెట్టి మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సూపర్‌హిట్‌ 'వైశాలి' తర్వాత దర్శకుడు అరివళగన్‌తో మరోసారి చేతులు కలిపారు. విజయవంతమైన కాంబోలో రాబోతున్న ఈ చిత్రం ఆది పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి 'శబ్దం' అనే టైటిల్ ఖరారు చేశారు. 'శబ్దం' టైటిల్ పోస్టర్ కి  ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. ఈ రోజు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది.  
 
7G ఫిల్మ్స్ శివ, ఆల్ఫా ఫ్రేమ్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, ఎస్ బానుప్రియ శివ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 'శబ్దం' ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది.
 
ఈ చిత్రం కోసం ప్రముఖ నటీనటులు, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు. అరుణ్ బత్మనాభన్ కెమెరా మెన్ గా పని చేస్తుండగా, స్టార్ కంపోజర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సాబు జోసెఫ్ ఎడిటర్ గా మనోజ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు.