మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 అక్టోబరు 2022 (13:44 IST)

గోవా - హైదరాబాద్ స్పైస్ జెట్ విమానానికి తప్పిన పెను ప్రమాదం

spicejet
గోవా - హైదరాబాద్ ప్రాంతాల మధ్య నడిచే స్పైస్‌జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఈ విమానం ఇంజిన్ నుంచి పొగలు వస్తున్నట్లు గుర్తించిన పైలట్ విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దీంతో అందులోని ప్రయాణికులు తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. 
 
మీడియా వర్గాల మేరకు, గోవా నుంచి హైదరాబాద్ స్పైస్‌జెట్ విమానం 86 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఈ విమానం టేకాఫ్ కాగానే విమానంలో పొగలు రావడాన్ని పైలెట్ గుర్తించారు. దీంతో ప్రయాణికులు భయాందోళనలు నెలకొన్నాయి.
 
విమానంలోని పొగ పీల్చడం వల్లే ఓ మహిళా ప్రయాణికుడు అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్‌ శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌ చేశాడు.