ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 జులై 2021 (15:38 IST)

సినీ నటి ఖుష్బూ ట్విట్టర్ ఖాతా హ్యాక్

తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ మహిళా నేత, సినీ నటి ఖుష్బూ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. ఈమె ఖాతాను హ్యాకర్స్ హ్యాక్ చేశారు. గతంలో ఓసారి ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేసిన హ్యాకర్స్ ఇప్పుడు మరోసారి హ్యాక్ చేశారు. కాగా ఈసారి హ్యాక్ చేసినవారు ఖుష్బూ పేరుని బ్రియాన్‌గా మార్చడమే కాకుండా… ఆమె ఫోటో‌ను కూడా మార్చేశారు.
 
అలాగే ఖుష్బూ చేసిన ట్వీట్స్, పోస్ట్‌లు అన్ని డిలీట్ చేశారు. ఇదే విషయాన్ని చెబుతూ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పుకొచ్చారు. గత మూడు రోజుల నుంచి పాస్వర్డ్ మార్చడానికి ప్రయత్నిస్తున్నా అవ్వటం లేదని చెప్పుకొచ్చారు. పైగా, అదే అంశంపై ఆ రాష్ట్ర డీజీపీ శైలేంద్ర బాబు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.