బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 ఆగస్టు 2024 (18:17 IST)

నన్ను కామాక్షి దేవాలయం గేటు బైటే ఆపేసారు, నమిత ఆవేదన (video)

Namitha
Namitha
హీరోయిన్ నమితకు చేదు అనుభవం ఎదురైంది. ప్రసిద్ధ మీనాక్షి దేవాలయంలోకి నమితను అనుమతించలేదు. అలాగే దేవాలయ సిబ్బంది ఆమెతో అమర్యాదకరంగా వ్యవహరించారని ఆమె తెలిపింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
వాళ్లు తనను ఆపి కొన్ని సర్టిఫికేట్లు అడిగారు. తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రముఖ ఆలయాలకు తాను వెళ్ళాను ఎప్పుడు ఇలా జరగలేదు అని తెలిపింది నమిత. తనతో అమర్యాదగా వ్యవహరించిన సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరకుంటున్నా అని చెప్పుకొచ్చింది.

కృష్ణాష్టమి కావడంతో ఆలయానికి కుటుంబ సమేతంగా వెళ్లిన తనకు చేదు అనుభవం ఎదురైందని చెప్పుకొట్టింది. అయితే ఆమె వ్యాఖ్యలను ఆలయ సిబ్బంది ఖండించింది. 
 
ఆలయ నియమాల ప్రకారమే ఆమెతో మాట్లాడమని పై అధికారులు చెప్పడంతో ఆమెను కొంత సమయం ఆపామని.. తర్వాత ఆమెను ఆలయంలోకి అనుమతించామని తెలిపారు.