బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 ఆగస్టు 2024 (11:47 IST)

రూ.50 కోట్ల దావా వేసిన మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్!!

remi sen
ఓ కార్ల కంపెనీపై మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన హీరోయిన్ రిమీ సేన్ రూ.50 కోట్లకు దావా వేశారు. మెగాస్టార్ చిరంజీవి "అందరివాడు" సినిమాలో రిమీ సేన్ నటించారు. తాజాగా ఆమె తన రేంజ్ రోవర్ కారులో అనేక సమస్యలను ఎదుర్కొన్న క్రమంలో కారు ఉత్పత్తిదారులపై దావా వేసింది. లీగల్  చర్యల్లో  భాగంగా, నవనీత్ మోటార్స్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీ, సతీష్ మోటార్స్‌లకు నోటీసులు పంపించారు. నోటీసు ఆమె అసలు పేరు, సుభమిత్ర సేన్ అని పేర్కొన్నారు. 
 
ఆగష్టు 25, 2022న, రిమీ సేన్ తన కారు వెనుక కెమెరా పనిచేయకపోవటంతో.. రివర్స్ చేస్తున్నప్పుడు పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనకు ముందు కూడా రిమీ సేన్ కారుతో అనేక సమస్యలను ఎదుర్కోవటం.. వాటిని పరిష్కరించే ప్రయత్నంలో అనేక సార్లు సంబంధిత డీలర్‌షిప్‌లను సందర్శించినా కానీ సమస్యలు పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. 
 
తన వాహనంతో నిరంతర సమస్యలతో విసుగు చెందిన తరుణంలో మానసిక వేదనను గురయ్యానంటూ పరిహారంగా తనకు‌‌ నష్టపరిహారం ఇవ్వాలని లీగల్ నోటీసులను జారీ చేసింది.  కారులో సమస్యల కారణంగా డీలర్ షిప్, కారు తయారీదారుల నుండి 50 కోట్లు పరిహారంతో పాటు వారిపై చట్టపరమైన ఖర్చులను నిమిత్తం మరో రూ.10 లక్షలు ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.