శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 మే 2020 (11:20 IST)

పూనమ్ పాండేకు చిక్కులు.. లాక్‌డౌన్ ఉల్లంఘించి స్నేహితుడితో చక్కర్లు

బాలీవుడ్ నటి, ప్రముఖ మోడల్ పూనమ్ పాండే మరోమారు చిక్కుల్లో పడ్డారు. ఆమెపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్డౌన్ రూల్స్ ఉల్లంఘించి తన స్నేహితుడితో కలిసి ముంబై రోడ్లపై కారులో చక్కర్లు కొట్టినందుకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బాలీవుడ్ నటి పూనమ్ తన మిత్రుడైన సినీ దర్శకుడు అహ్మద్ బాంబేతో కలిసి ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో బీఎండబ్ల్యూ కారులో బంద్రా నుంచి మెరైన్ డ్రైవ్‌కు బయలుదేరారు.
 
వీరి కారును ఆపిన మెరైన్ డ్రైవ్ ప్రాంత పోలీసులు, బయటకు వచ్చిన కారణాన్ని అడుగగా, సరైన సమాధానం చెప్పక పోవడంతో, ఇద్దరినీ అరెస్టు చేసి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
ఆ తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై వారిని వదిలేశారు. ఈ విషయాన్ని జోన్ 1 డిప్యూటీ పోలీసు కమిషనర్ సంగ్రామ్‌సింగ్ నిశందర్ వెల్లడించారు. పైగా, లాక్డౌన్ రూల్స్ ఉల్లంఘించినందుకుగాను వారిద్దరిపైనా ఐపీసీ సెక్షన్ 188, 269 కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.