సోమవారం, 4 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 30 మే 2023 (19:24 IST)

నా పాలిట నా తండ్రి విలన్ అని చెప్పనుగానీ... : వనితా విజయకుమార్

vanitha vijayakumar
దక్షిణాది చిత్రపరిశ్రమలోని సీనియర్ నటుల్లో విజయకుమార్ ఒకరు. ఈయన కుమార్తెల్లో ఒకరు వనితా విజయకుమార్. ఇప్పటికే మూడు వివాహాలు చేసుకున్నారు. మొదటి ఇద్దరు భర్తలకు విడాకులు ఇచ్చారు. మూడో భర్తతో తెగదెంపులు చేసుకున్న తర్వాత ఆయన ఇటీవల గుండెపోటుతో చనిపోయారు. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా "మళ్లీ పెళ్లి" చిత్రంలో నటించారు. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు. 
 
ఇందులో ఆమె మాట్లాడుతూ సాధారణంగా ఏ అమ్మాయికైనా తండ్రినే హీరో. అలాంటిది మా ఫాదర్ మాత్రం నా పాలిట విలన్ అని చెప్పనుగానీ, ఆయన నా పట్ల చాలా కఠినంగా ప్రవర్తించారు. మా ఫాదర్‌కి నాకు ఆస్తి తాలూకూ గొడవలు కూడా ఉన్నాయి. ఆ విషయంలో ఆయన నన్ను పోలీసులతో ఇంట్లో నుంచి బయటకు గెంటివేశారు. 
 
అలా ఇంటి నుంచి బయటకు వెళ్లిన రోజు ఎక్కడకు వెళ్లాలో అర్థంకాలేదు. నడిరోడ్డుపై నిలబడిపోయాను. అపుడు ఉన్న ప్రభుత్వం వల్ల ఆయన ఆ పని చేయలగలిగారు. కానీ, ఇపుడు వాళ్లు అలా చేయలేరు. ఆ పరిస్థితుల్లో నేను పిల్లలతో మైసూర్ వెళ్లిపోయి కొంతకాలం అక్కడే ఉన్నాను. నువ్వు ఇకపై ఎప్పటికీ తమిళనాడులోకి అడుగుపెట్టలేవు అని హెచ్చరించారు కూడా. అలాంటిది ఇపుడు నేను తమిళనాడులో దర్జాగా తిరుగుతున్నాను. బతుకుతున్నాను కూడా అని చెప్పారు.