బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 జూన్ 2023 (16:02 IST)

బైక్ నడపడం అంటే భయం.. ఎలా పోగొట్టుకున్నానంటే..? వరలక్ష్మి

varalakshmi
సినీనటి వరలక్ష్మి తమిళం, తెలుగు, మలయాళం వంటి పలు భాషా చిత్రాల్లో నటించింది. తాజాగా వరలక్ష్మి హీరోయిన్ బైకు రైడింగ్ గురించి ఇన్ స్టాలో స్టోరీగా పెట్టేసింది. ఫోటోలు, వీడియోలతో తాను బైక్ ఎలా నేర్చుకున్నానో చెప్పేసింది. తన భయాన్ని పోగొట్టుకుని బైక్‌ను ఎలా నడిపానో తెలిపింది. 
 
ఈ పోస్ట్‌లో, "చిన్నప్పటి నుంచి బైక్ నడపాలంటే భయం. కానీ ఆ భయాన్ని వదిలించుకునే సమయం వచ్చేసింది. కాబట్టి, గత వారం నేను బైక్ రైడింగ్ మొదటి అడుగుతో ప్రారంభించాను - సైకిల్, స్కూటీ, బుల్లెట్ ఇలా ఒక్కొక్కటిగా నేర్చుకున్నాను. 
 
ఇదంతా భయాన్ని పోగొట్టుకునేందుకే. ఎలా పడిపోయామన్నది ముఖ్యం కాదు ఎలా లేచాం అనేదే ముఖ్యం.." అంటూ వరలక్ష్మీ ఇన్ స్టాలో పేర్కొంటూ వీడియోను పోస్టు చేసింది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది.