ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (20:40 IST)

ఎన్టీఆర్ - కొరటాల చిత్రంలో మరో బాలీవుడ్ నటుడు

saif ali khan
జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్‌తో నిర్మతమవుతున్న చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ చేరినట్టు వార్తలు వస్తున్నాయి. జాతీయ అవార్డు గ్రహీత అయిన సైఫ్ అలీ ఖాన్ హైదరాబాద్ నగరంలోని ఆర్ఎఫ్‌సీలో జరుగుతున్న షూటింగులో పాల్గొన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఫోటోలను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. 
 
కాగా, ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఇటీవల జరుగగా, ఈ పూజా కార్యక్రమంలో రాజమౌళి, ప్రశాంత్, ప్రకాష్ రాజ్, జాన్వీ కపూర్ తదితరులు హాజరయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ నటించే 30వ చిత్రం. ఇందులో దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. కాగా, ప్రభాస్ - ఓం రౌత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న "ఆదిపురుష్" చిత్రంలో సైఫ్ ప్రతినాయకుడిగా నటించిన విషయం తెల్సిందే.