శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 మార్చి 2023 (17:17 IST)

రీ-రిలీజ్‌కు సిద్ధమవుతున్న "సింహాద్రి"

simhadri
దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం "సింహాద్రి". జూనియర్ ఎన్టీఆర్ హీరో. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇపుడు ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. 
 
'సింహాద్రి' చిత్రానికి సంబంధించిన 4కె రీమాస్టర్ ప్రింట్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఈ మూవీని 4కె అల్ట్రా హెచ్.డి.తో పాటు 5.1 డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీతో రీ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయింది. 
 
జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు భూమిక, అంకితలు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి దర్శకుడు. అయితే, ఈ చిత్రాన్ని ఎపుడు రిలీజ్ చేస్తారన్న అంశంపై మూవీ మేకర్స్ నుంచి ఓ క్లారిటీ రావాల్సివుంది.