గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 8 అక్టోబరు 2017 (14:31 IST)

''స్పైడర్'' రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్లు.. తమిళంలోనూ నిరాశే!

''స్పైడర్'' కలెక్షన్ల విషయంలో దూసుకుపోతోంది. టాలీవుడ్ ప్రిన్స్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా, మురుగదాస్ దర్శకత్వంలో విడుదలైన ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న స్పైడర్ కలెక్షన్ల పరంగా విషయంలో దూసుకెళ్తోంది. ఈ సినిమా

''స్పైడర్'' కలెక్షన్ల విషయంలో దూసుకుపోతోంది. టాలీవుడ్ ప్రిన్స్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా, మురుగదాస్ దర్శకత్వంలో విడుదలైన ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న స్పైడర్ కలెక్షన్ల పరంగా విషయంలో దూసుకెళ్తోంది. ఈ సినిమా 12 రోజుల పోస్టర్‌ను విడుదల చేసిన నిర్మాతలు తమ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సంపాదించిందని ప్రకటించారు. ఇంత భారీ కలెక్షన్ల వర్షాన్ని కురిపించిన ప్రేక్షకులకు, మహేష్ ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  
 
'బాహుబలి' తరువాత విదేశాల్లో అత్యధిక సెంటర్లలో 'స్పైడర్' విడుదలైన సంగతి తెలిసిందే. 11 రోజుల్లోనే ఈ కలెక్షన్లు వచ్చాయి. ఓవర్ సీస్‌లో 16 మిలియన్ డాలర్ల కలెక్షన్‌కు చిత్రం చేరుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
 
ఇకపోతే స్పైడర్ తెలుగు కంటే కాస్త తమిళ్‌లో మంచి రివ్యూలను, రేటింగులను పొందిన ఈ చిత్రం, కలెక్షన్స్ పరంగా మాత్రం ఆ ఊపుని చూపించలేకపోయింది. తెలుగులో మిస్పయినా.. తమిళ్ ద్వారా అయినా నిలబడాలని చూసిన నిర్మాతలకు ఈ చిత్రం నిరాశనే మిగిల్చినట్లుగా తెలుస్తోంది.