శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 8 నవంబరు 2023 (15:38 IST)

శిష్యుడు ఎస్.కే.ఎన్ సక్సెస్ కు హ్యాపీగా ఫీలవుతున్న అల్లు అరవింద్

Alluaravind wishes SKN
Alluaravind wishes SKN
బేబి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో హ్యాపెనింగ్ యంగ్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు ఎస్ కేఎన్. మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్ ను ప్రాణంగా అభిమానిస్తాడు ఎస్ కేఎన్. మెగాస్టార్ ను తన బాస్ గా, అరవింద్ గారిని ఒక గురువుగా భావిస్తాడు. ఎస్ కేఎన్ సక్సెస్ లో అల్లు అరవింద్ పాత్ర ఎంతో ఉంది. ఎస్ కేఎన్ ను ప్రోత్సహిస్తూ అవసరమైన సందర్భంలో సపోర్ట్ చేస్తుంటారు అల్లు అరవింద్. ఒక శిష్యుడిలా, బిడ్డలా చూసుకుంటారు. 
 
మరి అలాంటి ఎస్ కేఎన్ ప్రొడ్యూసర్ గా ఎదగడం, సక్సెస్ ఫుల్ సినిమాలతో ఆర్థికంగా స్ట్రాంగ్ అవడం అరవింద్ గారికి సంతోషాన్నిచ్చే విషయమే. మెగాస్టార్ చిరంజీవి కూడా బేబి సక్సెస్ మీట్ లో తన అభిమాని ఎస్ కేఎన్ ప్రొడ్యూసర్ అవడం, సూపర్ హిట్ సినిమా చేసి గుర్తింపు తెచ్చుకోవడం తనకెంతో గర్వంగా ఉంటుందని వేదిక మీదే చెప్పారు. తన అభిమానులు తెర వెనకే కాదు ఇండస్ట్రీలోకీ రావాలని పిలుపునిచ్చారు.
 
బేబి సూపర్ హిట్ తర్వాత  సాయి రాజేశ్ నిర్మాణ సంస్థ అమృత ప్రొడక్షన్స్ తో కలిసి తన మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆనంద్ దేవరకొండ, సంతోష్ శోభన్ లతో కల్ట్ లవ్ స్టోరీ మూవీస్, కమర్షియల్ సినిమాలు నిర్మిస్తున్నారు ఎస్ కేఎన్. బేబి మూవీని హిందీలో ఎస్ కేఎన్ రీమేక్ చేస్తాడంటూ అరవింద్ గారే స్వయంగా ప్రకటించారు. ఇటీవలే ఓ బెంజ్ కారు కొన్నారు. గీతా ఆర్ట్స్ ఆఫీస్ దగ్గర గురువు లాంటి అరవింద్ గారిని కలిశాడు. శిష్యుడి ఎదుగుదల అరవింద్ గారికి తప్పకుండా సంతోషాన్ని కలగజేస్తుంది.