చింతపల్లి గ్రామంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి..
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చింతపల్లి గ్రామంలో సందడి చేశారు. నల్గొండ జిల్లాలో ఉన్న ఈ గ్రామంలో ఆయన భార్య స్నేహారెడ్డి తరపు బంధువులు ఉన్నారు. వారిని చూసేందుకు ఆయన తన భార్యతో కలిసి అక్కడకు చేరుకున్నారు. ఇటీవల స్నేహారెడ్డి తరపు బంధువు మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు అల్లు అర్జున్ వచ్చారు.
అయితే, చింతపల్లి గ్రామానికి అల్లు అర్జున్ వచ్చారన్న విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు భారీగా తరలివచ్చారు. తమ అభిమాన హీరోను చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి చేతులు ఊపుతూ అభివాదం చేశారు. అల్లు అర్జున్ కూడా వారికి అభిమానంతో చేతులు ఊపుతూ తన వాహనంలో ముందుకెళ్లిపోయారు. ఈ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తును కల్పించారు.