శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 26 అక్టోబరు 2018 (17:57 IST)

బన్నీ ఎంత అందంగావున్నాడో.. డాన్స్ సూపర్బ్... పంజాబీ బ్యూటీ

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌పై పంజాబీ బ్యూటీ పరుల్ గులాటీ మనసుపారేసుకుంది. బన్నీ చాలా అందంగా ఉన్నాడనీ, ఆయన డాన్స్ సూబర్బ్‌గా ఉందని గులాటీ వ్యాఖ్యానిస్తోంది. ఇంతకీ ఈ బన్నీపై ఈ భామకు ఎందుకు ప్రేమ పుట్టిందో తెలుసుకుందాం. 
 
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం రెడ్‌బస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా రెడ్ బస్ కొత్త యాడ్ చిత్రీకరణ ఇటీవల చేశారు. ఆ యాడ్‌లో అల్లు అర్జున్‌తో పాటు బాలీవుడ్ ముద్దుగుమ్మ మోడల్ పరుల్ గులాటి నటించింది. 
 
ఆ సందర్బంగా బన్నీతో తీసుకున్న ఒక సెల్ఫీని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పంజాబీ ముద్దుగుమ్మ బన్నీపై ప్రశంసల జల్లు కురిపించింది. బన్నీ గురించి ఆయన డాన్స్ గురించి పరుల్ గులాటి ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది.
 
యాడ్‌లో బన్నీతో డాన్స్ చేసే అవకాశం ఈమెకు దక్కకపోయినప్పటికీ బన్నీ డాన్స్ గురించి మాట్లాడటం ద్వారా ఈమె ఇంకా ఏదో ఆలోచనలో ఉందా అనిపిస్తుంది. బన్నీతో ఈమె సినిమా ఛాన్స్‌ను ఆశిస్తుందేమో బన్నీ‌తోకాకున్నా సౌత్‌లో ఎంట్రీ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో బన్నీ గురించి ఈమె కామెంట్స్ చేసి ఉంటుందని అనిపిస్తుంది.