శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 21 డిశెంబరు 2024 (21:09 IST)

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

Allu Arjun
అల్లు అర్జున్ ఒంటరిగా ఇంటిలో కూర్చున్నాడు. గార్డెన్ లో ఒంటరిగా కూర్చుని సక్సెస్‌ను ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. తండ్రిగా తను ఏమైపోతాడనే బెంగ కలిగింది. ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళమని ఎక్కడికైనా వెళ్ళమంటే.. ఆ కుటుంబమే నా కళ్ళ ముందు కనిపిస్తుందని బాధపడుతున్నాడు. తండ్రిగా నేనెంతో బాధపడుతున్నాను. ఈలోగా రకరకాలుగా ఫాల్స్ వార్తలు వస్తున్నాయి. బాధగా వుంది అని అల్లు అరవింద్ అన్నారు. 

శనివారం రాత్రి అత్యవసర విలేకరుల సమావేశం అల్లు అర్జున్ ఏర్పాటు చేశారు. తనపై వస్తున్న విమర్శలు అవాస్తలను ఏకరువు పెట్టారు.
 
అందరికీ సారీ... కాస్త టైం చేయించినందుకు.. ఈ ఒక్కసారి అర్థం చేసుకోండి. చాలా ఓపికగా మాట్లాడాలి. డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన తర్వాత తనపై వస్తున్న విమర్శలు, ఆరోపణలు, కమ్యూనికేషన్ గేప్ వల్ల వచ్చినవే. నాకు దయాగుణం లేదని కేర్‌లెస్‌గా వెళ్ళిపోయారని, పోలీసులు భద్రత కల్పించలేమని చెప్పారనడం కూడా నాకు అస్సలు తెలీదు.. పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ఓ వ్యక్తి సార్. నాకు చాలా బాధగా వుంది. ఇలాంటి ఘటన జరగడంఅన్నారు. నాకు అంతకంటే బాధగా వుంది. వారి కుటుంబానికి నేను, మైత్రీ మూవీస్ సంస్థ, సుకుమార్ కలిసి ఎమౌంట్ ఇవ్వాలని అనుకున్నాం. వారి కుటుంబానికి అండగా వుంటాను అన్నారు.
 
ఇంకా ఆయన మాట్లాడుతూ, నాకూ పిల్లలున్నారు. నేనెందుకు కేర్‌లెస్‌గా వుంటాను చెప్పండి.  అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్. ప్రతి సెక్షన్ నమ్మకంతో పనిచేశారు. ఇది యాక్సిడెంట్. వారి ఫ్యామిలీకి బాధపడుతున్న రేవతి భర్తగారిని కంట్రోల్ చేయలేం. ఆ ఫ్యామిలీకి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నా. శ్రీతేజ్ ఎలాగున్నాడనేది అప్‌డేట్‌లో వున్నాను. కొంచెం ఆనందంగా వుంది. ఈరోజు ప్రెస్ మీట్ కు కారణం. మిస్ కమ్యూనికేషన్ వల్ల జరుగుతుంది. నేను పోలీసులను గానీ, ప్రభుత్వాన్ని కానీ వేలెత్తి చూపడం లేదు.  నేను ఇలా చేశాను. అలా చేశానని వార్తలు రావడంతో నేను మీముందుకు వచ్చాను. 20 ఏళ్ళుగా నేను మీకు తెలుసు. నామీద వచ్చినవన్నీ అవాస్తవాలే. సినిమా సక్సెస్ అయినా బయటకు వెళ్ళలేకుండా పోతున్నా. రాబోయే సినిమాలు ఎలా తీయాలనేది ఇదో అనుభవంలా వుంది. 15 రోజులు ఇంట్లో ఒంటరిగా కూర్చున్నానంటే ఇదే ఫస్ట్ టైమ్. 
 
నేను ఇలా అన్నానట. కాళ్ళు చేతులు విరిగిపోయినా పర్లేదు అన్నానట. నా మీద తప్పుడు కథనాలు వస్తున్నాయి. నా గురించి వచ్చిన ప్రచారం చెప్పాలని చెబుతున్నా. గత మూడేళ్ళుగా సినిమా తీశానంటే బాధ్యతగా వుంటాను. 20 ఏళ్ళుగా అదే థియేటర్‌కు చాలాసార్లు వెళ్ళాను. ఆరోజు పర్మిషన్ లేకుండా వెళ్ళాననేది అవాస్తవం. థియేటర్ పర్మిషన్ ఇవ్వలేదని అవాస్తవం. నిజంగా పర్మిషన్ లేకుండా వుంటే థియేటర్ వారే వచ్చి చెబుతారు. నామీద వచ్చిన రోడ్ షో అన్నారు. కారు అలా వెళుతూ జనాలను చూసి ఆగిపోయింది. బౌన్సర్లు ఇతరులు నన్ను ఒక్కసారి చేయి ఊపితో అభిమానులు వెళ్ళిపోతారన్నారు. 
 
వేలాదిమంది వచ్చాక హీరో గ్లింప్స్ కావాలి. వారిని చూడగానే థ్యాంక్ యూ.. అని చేయి ఊపాను. అలా థియేటర్ కు వెళ్ళాను. అక్కడ పోలీసులు కానీ ఎవరూ రాలేదు. నా టీమ్ వచ్చి సార్.. క్రౌడ్ బాగా వుంది. వెళ్ళిపోమని చెప్పారు. వెంటనే వెళ్ళిపోయాను. ఆ విషయం తెలీదు. తర్వాత రోజు రేవతి అనే మహిళ చనిపోయిందట. తెలుసుకుని షాక్ అయ్యాను. నిజంగా అదేరోజు తెలిస్తే అసలు వెళ్ళిపోయేవాడిని. నేను తెలిసి వెళ్ళిపోయానని అవాస్తవాలు రావడం చాలా బాధాకరం. చనిపోయారని తెలిసి షాక్ అయ్యాను. వెంటనే బన్నీవాస్‌కు చెప్పి ఆసుప్రతికి వెళ్ళమన్నాను. అక్కడకి వస్తానని అంటే వద్దు సార్. మళ్ళీ చాలా ప్రాబ్లమ్ అవుతుందన్నాడు. ఆ తర్వాత నాకు మీమీద కేస్ ఫైల్ చేశారని బన్నీవాస్ చెప్పాడు. ఆ తర్వాత పోలీసులు కూడా వెళ్ళవద్దన్నారు. అందుకే వెళ్ళలేదు. 
 
ఏదైనా ఇతర ప్రాంతాల్లో అభిమానులు చనిపోతే చిరంజీవి ఫ్యాన్స్ చనిపోతే వెళ్ళి పరామర్శించాను. అది మినిమం, అంతేకానీ నేను ఈ విషయంలో స్పందించలేదు అనడం కరెక్ట్ కాదు. ఆ తర్వాత నేను ఓ వీడియోలో చెప్పాను. నేను ఆ ఫ్యామిలీకి సాయం చేస్తానని చెప్పాను. సినిమా గురించి ఫంక్షన్లు కర్నాటక తదితర ప్రాంతాల్లో చేద్దామనుకున్నాం. అన్నీ కేన్సిల్ చేశాం. మా నాన్నగారిని వెళ్ళమని చెప్పాను. కానీ పోలీసులు వద్దన్నారు. ఏదైనా నేను ఎదుర్కోగలను. కానీ ఈ విషయంలో నేను చాలా లోపాయింట్‌గా వున్నాను. 
 
కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ శనివారంనాడు సంథ్య థియేటర్లో జరిగిన ఉదంతంపై గంట పాటు చర్చ చేశారు.
 
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పుష్ప 2 సినిమా ముందు రోజు అనగా 4వ తేదీనాడు హైదరాబాద్ ఆర్.టి.సి. క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ దగ్గర అల్లు అర్జున రాక సందర్భంగా ఏర్పడిన విధానాన్ని పూసగుచ్చినట్లు వెల్లడించారు. థియేటర్ కు తన బాబుతో వచ్చిన రేవతి అనే మహిళ, తన కొడుకు చేయిపట్టుకుని రావడం నేను వీడియోలో చూశాను. అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా అభిమానులును చెదరగొట్టేందుకు బౌన్సర్లు కంట్రోల్ చేసే సమయంలో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఆ తర్వాత చూస్తే రేవతి అనే మహిళ అలాగే చేత్తో పట్టుకున్న కొడుకుతో సహా కిందపడిపోయారు. పోలీసులు చెక్ చేసి వెంటనే ఆసుప్రతికి తీసుకెళ్లడం ఆమె చనిపోవడం, కొడుకు ఇంకా కోమాలో వుండడంత వంటి సంఘటన జరిగింది. టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వబోమని తేల్చిచెప్పారు.
 
అల్లు అర్జున్ ను మీడియా పలు ప్రశ్నలు వేయడంతో.. లీగల్‌గా మా న్యాయవాదులు ఇచ్చిన సలహా మేరకు ప్రభుత్వంపరంగా కొన్ని లిమిట్స్ వున్నాయి. అందుకే మాట్లాడలేకపోతున్నాం అని అన్నారు.