Daily Horoscope
✕

త‌గ్గేదే లే.. అంటోన్న అల్లు అర్జున్(Video)

Updated: బుధవారం, 7 ఏప్రియల్ 2021 (22:08 IST)
Pupsha teaser
అల్లు అర్జున్ న‌టించిన `పుష్ప‌రాజ్‌` సినిమా టీజ‌ర్ ఆవిష్క‌ర‌ణ బుధ‌వారం రాత్రి హైద‌రాబాద్‌లో జ‌రిగింది. అర్జున్ అభిమానులు వేలాదిగా త‌ర‌లివ‌చ్చి జెఆర్‌.సి. క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ నిండిపోయింది. చెన్నై నుంచి కూడా కొంద‌రు అభిమానులు వ‌చ్చారు.
 
8.45 నిముషాల‌కు అల్లు అర్జున్ ఫంక్ష‌న్‌కు రావ‌డం, టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌డం జ‌రిగింది. టీజ‌ర్‌లో అల్లు అర్జున్ యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఎక్కువ‌గా వున్నాయి.
అడ‌విలో లారీ లోడ్‌తో వ‌స్తుండ‌గా ఓ వ్య‌క్తి విజిల్ వేయ‌గా, యాక్ష‌న్ సీన్స్ మొద‌లవుతుంది. రెండు చేతులు వెన‌క్కి క‌ట్టివేసిన వ్య‌క్తి మొహం క‌నిపించ‌కుండా ముసుగు వేసుకుని వ‌స్తున్న వ్య‌క్తి క‌నిపిస్తాడు. ఆ త‌ర్వాత పోలీసులు ఫైరింగ్‌. ఆ వెంట‌నే లారీలో డ్రైవ‌ర్‌గా అల్లు అర్జున్ క‌నిపిస్తాడు. ఆ వెంట‌నే ర‌స్మిక డాన్స్‌తో ద‌ర్శ‌న‌మిస్తుంది. ఆ త‌ర్వాత యాక్ష‌న్ స‌న్నివేశాలు. ఆవేశంగా ఒక వ్య‌క్తిని కొట్టిన బ‌న్నీ... త‌గ్గేదే లే.. అంటూ గ‌డ్డం కింద‌నుంచి చేయి నిమురుకుంటూ అన్న డైలాగ్ పేలింది.
 
ఈ కార్య్ర‌క‌మానికి వ‌చ్చిన అనంత‌రం ఒక్క‌మాట‌లో చెప్పాలంటే, ఇదే ఆఖ‌రు మాట పుష్ప గురించి అంటూ అల్లు అర్జున్ త‌గ్గేదే లే..అన్నాడు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించింది.

అన్నీ చూడండి

వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్.. ఎందుకంటే..?

దీపావళి కానుకగా హైదరాబాదులో మెట్రో, ఆర్టీసీ పాసుల ధరల తగ్గింపు

భార్యతో పాటు ఏడుగురు కుటుంబ సభ్యులను హత్య చేసిన క్యాబ్ డ్రైవర్

అమర్నాథ్ రెడ్డి బాగా చేసాడన్నందుకు సస్పెండ్ చేస్తారా? నాలాంటోడు మీకు దొరుకుతాడా? పలమనేరు వార్డు వైసిపి అభ్యర్థి, వీడియో

సీఎం చంద్రబాబుపై కేసులు.. సీబీఐకి బదిలీ చేయాలనే పిల్.. హైకోర్టు విచారణ వాయిదా

అన్నీ చూడండి

రుచీపచీ లేని ఈ పండు చేసే మేలు ఎంతో తెలుసా?

ఫ్రిజ్‌లో కోడిగుడ్లు పెడితే ఏమవుతాయి?

ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంత ప్రజలకు తుఫాను అనంతర హెల్త్ అడ్వైజరీ జారీ చేసిన స్టార్ హెల్త్

ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై హెర్బాలైఫ్ ఇండియా, ఐఐఎస్‌సీ చారిత్రాత్మక అధ్యయనం ప్రారంభం

లవంగాలు ఎలా ఉపయోగపడుతాయో తెలిపే 8 పాయింట్లు

తర్వాతి కథనం
Show comments