ముచ్చటగా మూడోసారి.. త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ మరోమారు రిపీట్ కానుంది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అల్లు అర్జున్ అడుగుపెట్టి 16 యేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ రివీట్ కానుంది. ఈ వార్త మెగా ఫ్యాన్స్‌కు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
నిజానికి వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో 'జులాయ్', 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాలు రాగా, అవి సూపర్ డూపర్ హిట్ సాధించాయి. ఈ నేపథ్యంలో వీరి కాంబినేషన్‌లో మూడో చిత్రం రానుందనే ప్రచారం జరిగింది. కానీ, దానిపై క్లారిటీ రాలేదు. ఈ పరిస్థితుల్లో హరిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ ఓ ట్వీట్ చేసింది.
బన్నీ - త్రివిక్రమ్ కాంబినేషన్‌పై ఫ్యాన్స్‌తో పాటు తాము కూడా చాలా ఆతృతగా ఉన్నామని హరిక అండ్ హాసిని క్రియేషన్స్ మార్చి 28వ తేదీ గురువారం ట్వీట్ చేసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు.. దీనికారణంగా సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేకపోతున్నట్లు తెలిపారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం అంటూ తెలిపారు.
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ లాస్ట్ ఫిల్మ్ 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. ఈ చిత్రం తర్వాత కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఈ హీరో. చాలా కథలు విన్నారంట. చివరకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.