శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 జులై 2022 (14:17 IST)

#Mashooka పాటను రిలీజ్ చేయనున్న అల్లు అర్జున్.. రకుల్ థ్యాంక్స్

Allu Arjun
Allu Arjun
బన్నీ ప్రముఖ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కోసం రంగంలోకి దిగాడు. ఆమె నటించిన మాషుక అనే ప్రైవేట్ సాంగ్ లాంచ్ చేయనున్నాడు బన్నీ. 
 
ఈ పాటలో రకుల్ ప్రీత్ సింగ్ స్టెప్పులేయనుంది. చాలా కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్న రకుల్. హిందీలో వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. 
 
తాజాగా ఈ అమ్మడు ఓ ప్రైవేట్ సాంగ్‏లో స్టెప్పులేసింది. మాషుక అనే ప్రైవేట్ స్పెషల్ చేసింది రకుల్. ఇప్పటికే విడుదలైన ఈ సాంగ్ ప్రోమో ఆకట్టుకుంటుంది. 
 
ఇక ఇప్పుడు మాషుక ఫుల్ సాంగ్‏ను జూలై 29న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విట్టర్ వేదికగా స్పెషల్ థాంక్స్ చెప్పింది రకుల్.