శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

మరోమారు రూ.1.75 కోట్ల సాయం చేసిన అమితాబ్

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మరోమారు పెద్ద మనసు చాటుకున్నారు. కరోనా కష్టకాలంలో ఆయన చేస్తున్న ధాతృత్వాలకు అడ్డేలేకుండా పోయింది. తాజాగా క‌రోనా పోరులో భాగంగా సుమారు రూ.15 కోట్లు వరకూ విరాళంగా ఇచ్చినట్టు ప్రకటించారు. 
 
ఢిల్లీలోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు రెండు కోట్లు సాయం చేసిన అమితాబ్ జుహూలో 25-50 బెడ్ల కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు నిధులు ఇచ్చారు. చాలామంది ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు పీపీఈ కిట్లు, మాస్క్‌లు అందజేశారు. ముంబైలోని ఆసుపత్రికి ఖరీదైన ఎంఆర్‌ఐ యంత్రం, సోనో గ్రాఫిక్, స్కానింగ్‌ పరికరాలు సమకూర్చారు.ఇకపోతే, పేద రైతుల్ని సైతం ఆర్ధికంగ ఆదుకున్న అమితాబ్ బ‌చ్చ‌న్ విదేశాల నుండి వెంటిలేట‌ర్స్ కూడా తెప్పించారు. 
 
తాజాగా సుమారు రూ.1.75 కోట్ల విలువ చేసే అత్యాధునిక వెంటిలేటర్లు, మానిటర్లు, వైద్య పరికరాలను ముంబైలోని సియాన్‌లో గల లోకమాన్య తిలక్‌ మున్సిపల్‌ జనరల్‌ ఆస్పత్రికి అందజేశారు. ఈ విష‌యాన్ని బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్ తెలియ‌జేసింది. శ్వాస స‌మ‌స్య‌తో బాధ‌పుడుతున్న వారికి ఈ వెంటిలేట‌ర్స్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని అంటున్నారు.